రెండు నెలల తుగ్లక్ పాలన | Two months Tughlaq ruling | Sakshi
Sakshi News home page

రెండు నెలల తుగ్లక్ పాలన

Jul 20 2014 2:43 PM | Updated on Aug 25 2018 7:03 PM

అంబటి రాంబాబు - Sakshi

అంబటి రాంబాబు

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల పాలన తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.

హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల పాలన తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. 9 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే బాబు రాజధాని నిర్మాణమంటూ హుండీలు పెట్టి రాష్ట్ర పరువును బజార్లో పెడుతున్నారన్నారు.  హుండీలు పెట్టే హక్కు దేవాదాయశాఖకు మాత్రమే ఉందన్నారు.

చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి  30 కోట్ల రూపాయలు, చాంబర్ కోసం 23 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు.  చంద్రబాబుకు ఓటేసింది హుండీలు పెట్టి, డబ్బు అడగటం కోసం కాదన్నారు. మంచి పరిపాలన అందిస్తారని ఓట్లేశారన్నారు. ఆయన రెండు నెలల పరిపాలనకే ప్రజలకు విసుగెత్తిందని అంబటి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement