లారీ, కారు ఢీ: ఇద్దరు వ్యక్తులు మృతి | Two killed, three injured in road accident in East Godavari District | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ: ఇద్దరు వ్యక్తులు మృతి

Dec 22 2013 8:21 AM | Updated on Aug 30 2018 3:56 PM

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున లారీ-కారు ఢీ కొన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున లారీ-కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు.

 

దాంతో క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారులోని ప్రయాణికులు పలాస నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement