బోల్తా పడిన అంబులెన్స్ | Two injured as Ambulance overturns | Sakshi
Sakshi News home page

బోల్తా పడిన అంబులెన్స్

Oct 23 2015 6:41 PM | Updated on Aug 25 2018 5:39 PM

ప్రమాదానికి గురైనవారిని రక్షించడానికి వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది.

గూడూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : ప్రమాదానికి గురైనవారిని రక్షించడానికి వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారి పై ఉన్న ఆదిశంకర కాలేజీ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది.

వివరాల ప్రకారం.. గూడూరు నుంచి నెల్లూరు వెళ్తున్న అంబులెన్స్ కాలేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంటనే మరో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి చెన్నైకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement