'వంశధార'లో విద్యార్థుల మృతదేహలు లభ్యం | Two engineering students dead bodies found in vamsadhara river | Sakshi
Sakshi News home page

'వంశధార'లో విద్యార్థుల మృతదేహలు లభ్యం

Feb 28 2014 9:26 AM | Updated on Aug 25 2018 6:08 PM

శ్రీకాకుళం జిల్లా హిరామండంలం గొట్టాబ్యారేజిలో నిన్న స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులలో ఇద్దరి మృతదేహాలను లభ్యమయ్యాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా హిరామండంలం గొట్టాబ్యారేజిలో నిన్న స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులలో ఇద్దరి మృతదేహాలను లభ్యమయ్యాయి. కిశోర రాజు, అజయ్ వెంకట కుమార్ మృతదేహలను శుక్రవారం ఉదయం గుర్తించారు. మరో విద్యార్థి అప్పలరెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది.

గరివిడి అవంతి సెయింట్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయంలో తీవ్ర రద్దీగా ఉండటంతో సమీపంలోని గొట్టా బ్యారేజ్ చూసొద్దామని వెళ్లారు.


అక్కడే ఉన్న వంశధార నదిలో నలుగురు విద్యార్థులు స్నానానికి దిగారు. అందులో ముగ్గురు విద్యార్థులు కిశోర రాజు, అజయ్ వెంకట కుమార్, అప్పలరాజు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నించగా వారు ప్రవాహంలో కొట్టుకుపోయారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు మృతదేహలు లభ్యమైనాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement