విభజనను తట్టుకోలేక ఆగిన గుండెలు | Two die in seemandhra | Sakshi
Sakshi News home page

విభజనను తట్టుకోలేక ఆగిన గుండెలు

Feb 19 2014 1:27 AM | Updated on Jun 1 2018 8:39 PM

రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతీరాఘవేంద్రనగర్‌కు చెందిన చేనేత వృత్తిదారుల సంఘం డెరైక్టర్

 న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతీరాఘవేంద్రనగర్‌కు చెందిన చేనేత వృత్తిదారుల సంఘం డెరైక్టర్ మేకల శ్రీరాములు (50) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని సాయంత్రం టీవీలో ప్రసారమైన వార్తలు చూస్తూ ఆవేదనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శ్రీరాములుకు భార్య నాగరత్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన వార్త విని వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో సమైక్యవాది గునిపాటి సుబ్బారాయుడు(68) గుండెఆగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement