ఆళ్లగడ్డ మండలంలో నంద్యాల జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు శనివారం అర్ధరాత్రి ఢీకొన్నాయి.
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో నంద్యాల జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు శనివారం అర్ధరాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన విష్ణుప్రియ, సునీల్, శివ, సంతోష్‌నగర్‌కు చెందిన రోహిత, ఉమేశ్, శివ, ఎల్‌బీనగర్‌కు చెందిన నరసింహా, నిజామాబాద్‌కు చెందిన అమర్‌లు గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురయిన బస్సుల్లో ఒకటి పుత్తూరు నుంచి హైదరాబాద్ వైపు, మరొకటి మెదక్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్నాయి. పుత్తూరు బస్సు డ్రైవర్ రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ఆళ్లగడ్డ)