ప్రసాద్ రెడ్డి హత్యకేసులో ఇద్దరి అరెస్ట్! | two arrested in ysrcp leader prasad reddy murder case | Sakshi
Sakshi News home page

ప్రసాద్ రెడ్డి హత్యకేసులో ఇద్దరి అరెస్ట్!

Apr 29 2015 2:12 PM | Updated on Jun 1 2018 8:31 PM

వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాప్తాడు:  వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు తాహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలు ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.  ఈ రోజు ఉదయం ఆరుగురు దుండగులు  ఎమ్మార్వో కార్యాలయంలోకి ప్రవేశించి... అక్కడే ఉన్న ప్రసాద్రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు.

ప్రసాద్రెడ్డి హత్య వార్త విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు .. ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ రెడ్డి హత్యతో రాప్తాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అనంతపురం ఎస్పీ రాజశేఖరబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ పదిమంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement