పోటెత్తిన తుంగభద్ర | Tungabhadra flood intensity | Sakshi
Sakshi News home page

పోటెత్తిన తుంగభద్ర

Aug 5 2014 12:49 AM | Updated on Aug 1 2018 3:55 PM

పోటెత్తిన తుంగభద్ర - Sakshi

పోటెత్తిన తుంగభద్ర

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం డ్యాం 33 క్రస్ట్‌గేట్లను పెకైత్తి 1,93,579 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 28 క్రస్ట్‌గేట్లను నాలుగున్నర అడుగులు,

హొస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం డ్యాం 33 క్రస్ట్‌గేట్లను పెకైత్తి 1,93,579 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 28 క్రస్ట్‌గేట్లను నాలుగున్నర అడుగులు, మిగతా క్రస్ట్‌గేట్లను ఒకటిన్నర అడుగు మేర పెకైత్తినట్లు తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు.

రెండు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడ నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,67,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,93,579 క్యూసెక్కులు ఉందని తెలిపారు.గ
 

Advertisement
 
Advertisement
Advertisement