
ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల భవనం
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: పదవ తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టీటీడీ డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం గత నెల 25 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ చేరే వారు ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేయగా, మంగళవారం టెన్త్ ఫలితాల విడుదలతో ఇంటర్‌లో చేరదలచిన వారు దరఖాస్తుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసే టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశ నోటిఫికేషన్ ఈ యేడాది త్వరగా విడుదల అయింది. దరఖాస్తు ప్రక్రియ గత నెల 25 నుంచే ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసేకొనే అవకాశం కల్పించారు.
రెండు ఇంటర్ కళాశాలలు
టీటీడీ పరిధిలో ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ఉన్నాయి. ఇందులో పద్మావతి జూనియర్ కళాశాలో బాలికలకే అడ్మిషన్లు ఇస్తారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో బాలబాలికలకు ఇరువురికి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో 9 గ్రూపుల్లో 968 సీట్లు అందుబాటులో ఉన్నా యి. అడ్మిషన్ పొందిన వారిలో 450 మందికి హాస్టల్ వసతి కల్పిస్తారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో 12 గ్రూపుల్లో 792 సీట్లు ఉన్నాయి. అడ్మిషన్ పొందిన వారిలో 350 మందికి హాస్టల్ వసతి ఉం ది. 20 కిమీ కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చిన వారికి మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తారు. పదవ తరగతిలో సాధిం చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం తక్కువగా ఉన్న వారి పిల్లలకు సైన్స్ కోర్సులకు 946 రూపాయలు, ఆర్ట్స్ గ్రూపులకు 394 రూపాయలు చెల్లించాలి.
డిగ్రీ కళాశాలలకు..
టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అందుబాటులో ఉన్నాయి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో 26 గ్రూపుల్లో 1295 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 900 హాస్టల్ సీట్లు ఉన్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 22 గ్రూపుల్లో 1177 సీట్లు ఉన్నాయి. కళాశాలలో చేరిన వారిలో 600 మందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో 17 గ్రూపుల్లో 870 సీట్లు ఉన్నాయి. కళాశాలలో చేరిన వారిలో 400 మందికి మాత్రమే హాస్టల్ వసతి ఉంది. ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 1,625 రూపాయలు ఫీజు రూపంలో చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే విధానం
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చేరదలచిన వారు admission.tirumala.org బ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.ఇంటర్,కోర్సులకు కావాల్సిన ∙ఆప్షన్లు ఇచ్చుకోవాలి. తమ వివరాలతోపాటు, కావాల్సిన కళాశాల, కోర్సులకు ఆప్షన ్లు ఇచుకోవాలి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చుకున్న ఆప్షన్ల మేరకు మెరిట్ ప్రకారం దరఖాస్తు తుది గడువు తర్వాత సీటు కేటాయిస్తారు. దరఖాస్తు తుది గడువును ఈ నెల 25గా ప్రకటించారు.
ప్రతిభకే పట్టం
ఈ విద్యా సంస్థల్లో ప్రతిభ కల్గిన విద్యార్థులకే అడ్మిషన్ అవకాశం ఉంది. 2015–16 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించే వారు. అయితే ఈ యేడాది కొత్త విధానం తీసుకొచ్చారు. ఎంసెట్ తరహాలో విద్యార్థులు తాము కోరుకుంటున్న కళాశాల, గ్రూపులను ఆప్షన్లుగా ఇచ్చుకోవాలి. వీరు ఇచ్చుకున్న ఆప్షన్ల ఆధారంగా తుది గడువు ముగిశాక, సీట్లను కేటాయించి విద్యార్థులకు ఎస్‌ఎంఎస్ పంపుతారు. ఎస్‌ఎంఎస్ అందుకున్న విద్యార్థులు సంబంధిత కళాశాలకు వెళ్లి తమ సర్టిఫికెట్లు చూపించి అడ్మిషన్ పొందవచ్చు.