తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి.. | TTD: Devotees will Allow To the Temple From June 11th | Sakshi
Sakshi News home page

తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి..

Jun 6 2020 2:41 PM | Updated on Jun 6 2020 2:46 PM

TTD: Devotees will Allow To the Temple From June 11th - Sakshi

సాక్షి, తిరుమల :  ఈ నెల 11 నుంచి తిరుమల దర్శనానికి భక్తులను అనుమతినిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన జేష్టాభిషేకం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా అనిల్‌ సింఘాల్‌ మాట్లాడుతూ.. ఉత్సవ విగ్రహాలు పటుత్వం కోసమే జేష్ఠమాసంలో జేష్టాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. దూరప్రాంతాల భక్తులెవ్వరూ తొందరపడి తిరుమలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కౌంటర్ల ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు ఇస్తుండటంతో తిరుపతిలో టికెట్లు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. దర్శనాలు ప్రారంభం అయ్యాక అవసరాన్ని బట్టి  మార్పులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. (నిజం కాదు: అక్రమం అంతకంటే కాదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement