టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

TTD Decide To Deposit In Only National Banks - Sakshi

సాక్షి, అమరావతి: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో భక్తులు అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని తెలిపింది. కాగా కానుకల రూపంలో టీటీడీకి ప్రతి ఏడాది పెద్ద ఎత్తను విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. అయితే వీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ఇక మీదట డిపాజిట్‌ చేయవద్దని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top