అట్రాసిటీ కేసుపై విచారణ | trial on the case atrasiti | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసుపై విచారణ

Feb 26 2017 10:53 PM | Updated on Sep 5 2017 4:41 AM

గిరిజన సహకార సంస్థలో ఎంసీడబ్ల్యూగా పనిచేస్తున్న దళిత మహిళా ఉద్యోగిని ఎం.సాయమ్మపై అదే సంస్థ మేనేజర్‌ ఎస్‌.నారాయణరావు ఇటీవల దాడికి పాల్పడినట్లు అట్రాసిటీ కేసు

సీతంపేట : గిరిజన సహకార సంస్థలో ఎంసీడబ్ల్యూగా పనిచేస్తున్న దళిత మహిళా ఉద్యోగిని ఎం.సాయమ్మపై అదే సంస్థ మేనేజర్‌ ఎస్‌.నారాయణరావు ఇటీవల దాడికి పాల్పడినట్లు అట్రాసిటీ కేసు నమోదైన విషయం విదితమే. దీంతో సంబంధిత మేనేజర్‌పై శనివారం విచారణ చేపట్టారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ పి.పెంటారావు దర్యాప్తు నిర్వహించారు. బాధితురాలు, మేనేజర్, ఇతర సిబ్బంది వద్ద వేర్వేరుగా స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. సూపర్‌బజార్‌ సేల్స్‌మన్‌ దుర్గారావు, ఇతరుల నుంచి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement