రాష్ట్ర విభజనకు నిరసనగా చేపట్ట తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు.
ట్రాన్స్‌కో ఉద్యోగుల సమ్మె వాయిదా
Feb 18 2014 2:14 AM | Updated on Sep 2 2017 3:48 AM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా చేపట్ట తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. దానికి బదులుగా జిల్లాలోని ఈ శాఖ ఉద్యోగులు బుధవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించనున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉన్న ట్రాన్స్‌కో ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం విశాఖలో సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన ఈ సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 17 నుంచి అన్ని విభాగాల్లోనూ నిరవధిక సమ్మె చేపట్టాలని మొదట భావించినప్పటికీ పార్లమెంటులో విభజన బిల్లు సంగతి తేలిన తర్వాత దీనిపై తుది నిర్ణ యం తీసుకోవాలని, ప్రస్తుతానికి బుధవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.
Advertisement
Advertisement