బాలల దినోత్సవం రోజున వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
వరంగల్: బాలల దినోత్సవం రోజున వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డోర్నకల్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న 14 ఏళ్ల బాలుడుని రైలు ఢీకొంది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ వద్ద షాలిమార్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ వివరాలు తెలియరాలేదు.