మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే: తోపుదుర్తి | topudurthi prakash reddy takes on minister paritala sunitha | Sakshi
Sakshi News home page

మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే: తోపుదుర్తి

Apr 10 2017 10:17 AM | Updated on Aug 10 2018 6:50 PM

మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే: తోపుదుర్తి - Sakshi

మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే: తోపుదుర్తి

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని రాప్తాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు.

అనంతపురం : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని రాప్తాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే రాప్తాడులో ఇప్పటివరకూ ఎనిమిది వైఎస్‌ఆర్‌ విగ్రమాలపై దాడులు జరిగాయని ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం కొసాగుతోంది. వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సీకేపల్లిలో వైస్‌ఆర్‌ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement