నేడు వైఎస్సార్ జనభేరి | today ysr janapatham in district | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ జనభేరి

Published Sun, May 4 2014 2:51 AM | Last Updated on Thu, Jul 26 2018 7:07 PM

నేడు వైఎస్సార్ జనభేరి - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదివారం జిల్లాకు రానున్నారు.    ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనిగిరి, చీరాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన జిల్లాకు చేరుకుంటారు. ఉదయం పది గంటలకు కనిగిరిలోని కంభం రోడ్డులో ఉన్న అర్బన్‌హట్ కాలనీ వద్ద హెలికాప్టర్ దిగుతారు.

కనిగిరి చేరుకుని అక్కడి నుంచి కొత్తూరులోని ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న సభా ప్రాంగణానికి వెళతారు.  బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి చేరుకుంటారు. అక్కడ  సభ ముగించుకుని, మధ్యాహ్నం 3.00 గంటలకు చీరాలలోని వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎం కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రచార రథంలో గడియారం స్తంభం సెంటర్ చేరుకుని  బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement