నేడు, రేపు స్కూళ్లకు సెలవు | Today, tomorrow, schools closed | Sakshi
Sakshi News home page

నేడు, రేపు స్కూళ్లకు సెలవు

Jun 25 2014 1:08 AM | Updated on Mar 21 2019 8:22 PM

నేడు, రేపు స్కూళ్లకు సెలవు - Sakshi

నేడు, రేపు స్కూళ్లకు సెలవు

భారీ ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పుల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్యంలోని పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
 
విశాఖపట్నం : భారీ ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పుల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్యంలోని పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి మంగళవారం సాక్షికి తెలిపారు.

బుధ, గురువారాల్లో కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా స్కూళ్లు తెరిచినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా, మంగళవారం అది 42 డిగ్రీలకు చేరుకుంది. మరోవైపు వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతోంది.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement