ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Nov 14th 2019 CM Ys Jagan Launched Mana Badi Nadu Nedu - Sakshi

బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలులో ప్రారంభించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూకు నివాళులర్పించారు.  ఇక న్యూఢిల్లీలోని శాంతివనంలోని నెహ్రూ ఘాట్ వద్ద  
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు కుటుంబసభ్యులు, కాంగ్రెస్‌ నేతలు  నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top