నేడు ‘సాక్షి-స్పెల్ బీ’ పరీక్ష | today sakshi Spell Bee Exam | Sakshi
Sakshi News home page

నేడు ‘సాక్షి-స్పెల్ బీ’ పరీక్ష

Oct 29 2014 3:35 AM | Updated on Aug 20 2018 8:20 PM

విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా ‘సాక్షి-స్పెల్ బీ’ విశేష కృషి చేస్తోంది. జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో నిపుణత సాధించేలా చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల

ఏలూరు సిటీ : విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా ‘సాక్షి-స్పెల్ బీ’ విశేష కృషి చేస్తోంది. జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో నిపుణత సాధించేలా చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జిల్లాలో బుధవారం సాక్షి-స్పెల్ బీ పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. నాలుగు విభాగాల్లో నిర్వహించే పరీక్షలో ఒక్కో కేటగిరీకి 40 నిమిషాల సమయం కేటాయిస్తారు. మొదటి రౌండ్‌ను ప్రిలిమినరీ రౌండ్‌గా నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను రెండో రౌండ్, క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు. జిల్లాలో ఏలూరు, ధర్మాజీగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకు, దొండపూడి, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, గణపవరం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, పెనుగొండ ప్రాంతాల్లోని ఆయా పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.  
 
 పరీక్షా కేంద్రాలివే..
 ఏలూరు : భాష్యం స్కూల్, కేకేఆర్ గౌతమ్ స్కూల్, సిద్ధార్థ విద్యాలయం, సర్ సీఆర్ రెడ్డి స్కూల్
 భీమవరం: సెయింట్ మేరీస్ స్కూల్,
 వెస్ట్ బెర్రీ స్కూల్
 తాడేపల్లిగూడెం : కింబర్లీ స్కూల్, శ్రీరమణ మహర్షి స్కూల్
 తణుకు: విరంచి విద్యానికేతన్, రూట్స్ స్కూల్, భాష్యం స్కూల్
 పాలకొల్లు: భారతీయ విద్యాభవన్స్,
 ఆదిత్య స్కూల్
 నరసాపురం: జేసికిలి స్కూల్, భాష్యం లిటిల్ చాంప్స్ స్కూల్ , ఆదిత్య స్కూల్
 జంగారెడ్డిగూడెం: ప్రతిభ స్కూల్
 కొవ్వూరు : పీఎస్‌ఆర్ అండ్
 వీఎన్‌డీఏవీ స్కూల్, భాష్యం స్కూల్
 ధర్మాజీగూడెం : శ్రీ విద్యా ఇంగ్లిష్ మీడియం స్కూల్
 దొండపూడి : సెయింట్ మెరీస్ స్కూల్
 గణపవరం : సాధన స్కూల్,
 విద్యాజ్యోతి స్కూల్
 పెనుగొండ: ఇన్‌పాంట్ జీసస్ స్కూల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement