హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి | To speed work on handri-niva | Sakshi
Sakshi News home page

హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి

Mar 22 2016 3:20 AM | Updated on Mar 21 2019 8:22 PM

హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి - Sakshi

హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి

హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ....

అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను  ఆదేశించారు. సోమవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న  ఆత్మకూరు మండలం పంపనూరు తండా నుంచి గొరిదిండ్ల వరకు పర్యటించి  నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో జాప్యం ఉండకూడదని, ప్రతి రోజు ప్రగతి చూపించాలని అధికారులను ఆదేశించారు. . భూసేకరణ, ఇత రాత్ర  ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement