దాడికేసు విచారణ వేగవంతం | To speed up the trial dadikesu | Sakshi
Sakshi News home page

దాడికేసు విచారణ వేగవంతం

Sep 6 2014 1:32 AM | Updated on Aug 21 2018 5:46 PM

చీడికాడ, బైలపూడి గ్రామా ల్లో పోలీసులపై దాడి కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు చీడికాడ పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులను వి చారించారు.

  •     17మంది అరెస్ట్
  •      పోలీసుల వైఖరికి నిరసనగా మహిళల ఆందోళన
  •      ఎస్.ఐ,హోంగార్డుల సస్పెన్షన్‌కు డిమాండ్
  •      ఏఎస్పీ హామీతో విరమణ
  • చీడికాడ: చీడికాడ, బైలపూడి గ్రామా ల్లో పోలీసులపై దాడి కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు చీడికాడ పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులను వి చారించారు. ఏఎస్పీ ఎ.బాబూజీ ఆ ద్వర్యంలో రెండు గ్రామాలకు చెందిన పలువురు అనుమానితులను సాయంత్రం చోడవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు.

    అనంతరం వా రిని ఎక్కడికి తరలించిందీ తెలియరాలేదు. విషయాన్ని పోలీసులు గోప్యం గా ఉంచారు. అయితే చీడికాడకు చెం దిన 17మందిని అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించినట్లు చోడవరం ఇన్‌చార్జి సీఐ భూషణనాయుడు తెలిపా రు. తదుపరి విచారణ అనంతరం మరికొందరిని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. కాగా పోలీసులపై దాడి ఘ టనలో  విచారణ పేరుతో అమాయకులను హింసిస్తే సహించేది లేదంటూ చీడికాడవాసులు ఆందోళన చేపట్టా రు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌ను ము ట్టడించారు.

    పోలీసుల అభ్యర్థన మేర కు ముగ్గురిని గ్రామపెద్దలు ఏఎస్పీ బాబూజీ సమక్షంలో అప్పగించారు. వారి వెంట పెద్ద ఎత్తున మహిళలు పో లీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపటా రు. దాడికి కారణాలును విశ్లేషించకుం డా అమాయకులను స్టేషన్‌కు తె చ్చి రెండు రోజులుగా   చితక బాద డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. వినాయక నిమజ్జనానికం టూ హోంగార్డు నాయుడు, అతని తొత్తు మురళి, ఎస్.ఐ కలిసి రూ. 5వేలు వ సూలు చేశారని, ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుంటున్నవారిపై లాఠీఛార్జి చేసి రెచ్చగొట్టారన్నారు.

    నెల రోజుల క్రితం తన భర్త అప్పలనాయుడును హోంగార్డు నాయుడు అన్యాయంగా కొట్టాడని ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు ఇప్పుడు జీపు ధ్వంసమం డటూ  అమయాకులను వేధించడం ఎం తవరకు న్యాయమని ఉమా అనే మ హిళ పోలీసులను నిలదీసింది. హోం గార్డు నాయుడు, ఎస్‌ఐ విశ్వనాథంలను సస్పెండ్ చెయ్యాలంటూ సర్పం చ్ దాసరి పంపురమ్మ,ఎంపీటీసీ స భ్యురాలు కడితి దేముడమ్మలతో పా టు మహిళలు స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఒకదశ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పో లీసులు లాఠీలతో నిరసన కారులను చెదరగొట్టేందుకు సిద్ధపడ్డారు.

    గ్రామ పెద్దల చొరవతో స్పందించిన ఏఎస్పీ బాబూజీ, చోడవరం ఇన్‌చార్జి సీఐ భూషన్ నాయుడు మహిళలతో చ ర్చించారు. ఈ సందర్భంగా భూషన్ నాయుడు మాట్లాడుతూ హోంగార్డు నాయుడును బదిలీ చేశామని,విచార ణ అనంతరం ఎస్.ఐపై చర్యలు తీసుకుంటామని,ఈ దాడితో సంబం దం లేని వారిని విడిచి పెడతామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఇప్పటి వరకు ఎవరిని అర స్టు చెయ్యలేదని బాబూజీ చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement