ప్రవాసులకు పంట..ఉద్యోగులకు మంట | To non-employees inflammation of the crop | Sakshi
Sakshi News home page

ప్రవాసులకు పంట..ఉద్యోగులకు మంట

Aug 30 2013 6:17 AM | Updated on Sep 1 2017 10:17 PM

డాలర్ దెబ్బకు రూపాయి కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

రాయికల్/మానకొండూర్, న్యూస్‌లైన్ : డాలర్ దెబ్బకు రూపాయి కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావంతో ఓవైపు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటుండగా మరోవైపు చమురు, బంగారం, కార్లు, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బహుళజాతి కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్‌లో అన్ని రకాల వస్తువుల ధరలు భగ్గుమనే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువ పడిపోతూ.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండడం ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)లో ఉన్న ఉద్యోగుల పర్మినెంట్ పెన్షన్ అకౌంట్ (ప్రాన్)లోని అసలు మొత్తాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు రూపాయి విలువ పతనం ప్రవాస భారతీయులకు లాభం చేకూర్చుతోంది. విదేశీ ద్రవ్య మారకం విలువ పెరగడంతో విదేశాల్లో ఉన్న ఉద్యోగులు, అక్కడ ఉపాధి పొందుతున్న పలువురు తమ సంపాదనను నగదు, బంగారం, ఇతర  విలువైన వస్తువుల రూపంలో స్వదేశానికి పంపిస్తున్నారు.
 
 జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసి ల్ల, కరీంనగర్, గోదావరిఖని, మంథని ప్రాంతాలకు చెందిన వేలాది మంది అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, జర్మనీ వంటి దేశాలతోపాటు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయా దేశాల్లో పె ద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తున్న ఎన్నారైలు సుమారు యాభై వేల మంది ఉంటా రు. విదేశీ ద్రవ్య మారకం విలువ అనూహ్యంగా పెరగడంతో ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.
 
 మరికొందరు మాత్రం నగదు, బంగారం, ఇతర వస్తువులపై పెట్టుబడులు పెడుతూ ఇక్కడ లాభాలు పొందేందుకు ప్ర యత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో వ్యాపారాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికులకు సైతం రూపాయి పతనం కావడం కొంత అనుకూలంగా మా రింది. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య మారకం ద్వారా తమ కష్టార్జితానికి ఎక్కువ ఫలితం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడి కార్మికులు వీలైనంత మొత్తం ఇప్పుడే పంపిస్తున్నారు. పలువురు బంగారం కొనుగోలు చేసి పంపిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement