బ్రేక్‌ దర్శనం టికెట్లలో భారీ కుంభకోణం | Tirumala Break Darshan Tickets Scam | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ దర్శనం టికెట్లలో భారీ కుంభకోణం

Mar 21 2017 8:43 PM | Updated on Sep 5 2017 6:42 AM

తిరుమలకు వెళితే నామాలు పెట్టుకోవడం ఆనవాయితీ, కాకపోతే అవినీతి అథికారులు స్వామివారికే నామాలు పెట్టారు.

తిరుపతి: తిరుమలకు వెళితే నామాలు పెట్టుకోవడం ఆనవాయితీ, కాకపోతే అవినీతి అథికారులు స్వామివారికే నామాలు పెట్టారు. శ్రీవారి టికెట్లను అక్రమంగా నల్లబజారులో అమ్ముకున్నారు. దేవస్థానానికి రావాల్సిన ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. స్వామివారి ఆదాయాన్ని లడ్డులా ఆరగించారు. చివరకు పోలీసులకు చిక్కారు.

శ్రీవారి బ్రేక్‌ దర్శనంలో భారీకుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న అవినీతి దందాని పోలీసులు చేధించారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను తిరుమల తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్న 9మంది దళారీలను పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ సూపరిడెంట్‌ ధర్మయ్య వీరందరికి ఎన్నో ఏళ్లుగా సహకరిస్తున్నారు.  కీలక నిందితుడైన ధర్మయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement