ఏపీ అసెంబ్లీకి వెళ్లడం టైమ్‌ వేస్ట్‌

time Waste to ap assembly meetings : audimulapu suresh - Sakshi

ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం సమయం వృథా అని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ వచ్చిన ఆయ న ఇక్కడి శాసన సభ ఆవరణలో కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో మా అసెంబ్లీకి వెళ్లడం టైమ్‌ వృథా. మాకు మాట్లాడేందుకు ఐదు నిమిషాలు కూడా మైక్‌ ఇవ్వరు. తెలంగాణలో మా త్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం లభిస్తోంది. ఇక్కడ శీతాకాల సమావేశాలు ఇన్నిరోజులు జరుపుతున్నారు.

 ఏపీలో బడ్జెట్‌ సమావేశాలే 14 రోజులు దాటనివ్వరు. ఇక్కడ ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ చాలా బలహీనంగా ఉంది. కానీ, ఏపీలో అన్నింటిని తట్టుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షంగా నిలబడుతోంది. టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హార్డ్‌ క్యాష్‌ ఇవ్వటం లేదు. కాంట్రాక్టుల ద్వారా కమీషన్‌ను వారికి చేరవేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వ సొమ్మునే ఖర్చు పెట్టారు అని చెప్పారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top