లారీని ఢీ కొన్న బైక్: ముగ్గురు మృతి | three killed in road accident East Godavari District | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొన్న బైక్: ముగ్గురు మృతి

Dec 26 2014 8:38 AM | Updated on Aug 30 2018 3:58 PM

తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం దంగేరు రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం దంగేరు రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement