వ్యాన్ - లారీ ఢీ: ముగ్గురు మృతి | Three killed in road accident | Sakshi
Sakshi News home page

వ్యాన్ - లారీ ఢీ: ముగ్గురు మృతి

Sep 10 2013 11:23 AM | Updated on Sep 1 2017 10:36 PM

మనకోడూరు మండలం గట్టుదుద్దినపల్లి వద్ద ఈ రోజు తెల్లవారుజామున గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీ కొట్టింది.

మనకోడూరు మండలం గట్టుదుద్దినపల్లి వద్ద ఈ రోజు తెల్లవారుజామున గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో ముగ్గరు వ్యక్తులు మరణించారని కరీంనగర్ సీఐ కే.సృజన్ రెడ్డి వెల్లడించారు. వ్యాన్ కమలాపురం వైపు వస్తుండగా ఈ దుర్ఘనట చోటు చేసుకుందని చెప్పారు. మృతుల్లో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నారన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

 

క్షతగాత్రులను కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతులు నవీన్ కుమార్, డేవిడ్ రాజు, రెడ్డి కిషోర్లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించామన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement