తిరుమలలో పెళ్లిళ్ల సందడి | Thousand Marriages in Tirumala in Three Days | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెళ్లిళ్ల సందడి

Aug 10 2014 10:42 AM | Updated on Sep 2 2017 11:41 AM

తిరుమలలో పెళ్లిళ్ల సందడి

తిరుమలలో పెళ్లిళ్ల సందడి

తిరుమలలో పెళ్లి సందడి నెలకొంది. శ్రావణమాసంలో ఈనెల 13, 14, 15 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి.

తిరుమల: తిరుమలలో పెళ్లి సందడి నెలకొంది. శ్రావణమాసంలో ఈనెల 13, 14, 15 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి. ఇందులో 13వ తేదీ శ్రావణ బహుళ తదియ బుధవారం రాత్రి ఉత్తరాభాద్ర నక్షత్రం, 14వ తేదీ చవితి గురువారం ఉదయం ఉత్తరాభాద్ర, రాత్రి రేవతి నక్షత్రం, 15వ తేదీ పంచమి శుక్రవారం ఉదయం రేవతి నక్షత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా  వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇక తిరుమలలో మాత్రం సుమారు వెయ్యికి పైగా పెళ్లిళ్లు చేసేందుకు ముందస్తు రిజర్వేషన్లు జరిగాయి.

టీటీడీ పౌరోహిత సంఘంలోనూ ఏడు వందలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంచనా వేశారు. పౌరోహిత సంఘంలోని కల్యాణవేదికలో ఒకే ముహూర్తానికి వందల సంఖ్యలో సామూహికంగా పెళ్లిళ్లు నిర్వహించాల్సి ఉండడంతో టీటీడీ కల్యాణకట్ట డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక  తిరుమలలోని అన్ని కల్యాణ మండపాలు ముందస్తుగానే బుక్ అయిపోయాయి. దీనివల్ల కల్యాణ మండపంతో పాటు పౌరోహితుడు, భాజాభజంత్రీలకు డిమాండ్ ఏర్పడింది. పెళ్లి సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement