హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం | thieves tried to steal in howrah express | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం

May 21 2015 6:31 AM | Updated on Aug 28 2018 7:30 PM

హౌరా ఎక్స్ ప్రెస్ లో బుధవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

టంగుటూరు:హౌరా ఎక్స్ ప్రెస్ లో బుధవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు భారీ చోరీకి  విఫలయత్నం చేశారు. తొలుత రైలును చైన్ లాగి ఆపిన దొంగలు దోపిడీకి యత్నించారు. ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదును, ఆభరణాలను దోచుకునేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు  కాల్పులు జరిపారు. కాగా, పోలీసులపై ఎదురు తిరిగిన దొంగలు రాళ్లు రువ్వి పరారయ్యారు.

 

అనంతరం మరో  రెండు రైళ్లలో కూడా దొంగలు దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది. చెన్నై ఎక్స్ ప్రెస్, తిరుమల ఎక్స్ ప్రెస్ లలో కూడా అదే తరహాలో దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement