డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన | The workers' protest in front of the depot | Sakshi
Sakshi News home page

డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన

Mar 4 2014 4:02 AM | Updated on Sep 29 2018 5:26 PM

డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నార్కట్‌పల్లి డిపోలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు విధులు బహిష్కరించారు.

 నార్కట్‌పల్లి  :  డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నార్కట్‌పల్లి డిపోలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు విధులు బహిష్కరించారు.

డిపోఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ డిపోలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్ల సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేయకుండా డిపో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో కార్మికులు వీక్లీఆఫ్‌లు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనేక పర్యాయాలు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎంఈ జాన్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం అనిల్‌కుమార్‌లు డిపోవద్దకు చేరుకొని యూనియన్ నాయకులతో చర్చించారు.

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఐతరాజు వెంకటయ్య, యాసిన్‌అలి, ప్రభాకర్, వెకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement