ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ

ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ - Sakshi


న్యూఢిల్లీః  ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలుగా పేర్కొంటూ వస్తున్న వార్తలు నిజం కాదని  కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.  ఇవన్నీ ఈ కమిటీ  గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికలోని అంశాలని ఆ వర్గాలు తెలిపాయి. శివరామకష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని ఆ వర్గాలు తెలిపాయి. అయితే  నివేదికను హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్  పరిశీలనకు  శుక్రవారం  ఆయన ముందు అధికారులు పెడతారని ఆ వర్గాలు వెల్లడించాయి. హోంమంత్రి పరిశీలన అయిన తరువాత అంటే శుక్రవారం గానీ, శనివారం గానీ  హోం శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయనున్నట్లు  ఆ వర్గాలు వివరించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top