నేడు తెలంగాణ పోరు జాతర | The new Bharatiya Janata Party. Playing a separate state | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ పోరు జాతర

Nov 21 2013 3:12 AM | Updated on Sep 2 2017 12:48 AM

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోం ది. ప్రత్యేక రాష్ట్ర సాధన, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ క్రెడిట్ అంశాల ప్రాతిపదికన జిల్లాలో తమ ప్రాభవాన్ని చాటేం దుకు సన్నద్ధమవుతోంది.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పునర్వైభవం దిశగా అడుగులేస్తోం ది. ప్రత్యేక రాష్ట్ర సాధన, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ క్రెడిట్ అంశాల ప్రాతిపదికన జిల్లాలో తమ ప్రాభవాన్ని చాటేం దుకు సన్నద్ధమవుతోంది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపెట్టాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ పోరు జాతర’ నిర్వహించేందుకు సర్వం సిద ్ధమైంది. పార్లమెంట్‌లో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతిస్తుందనే స్పష్టమైన వైఖరితోనే యూపీఏ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంద నే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దేశానికి ప్రత్యామ్నాయం నరేంద్రమోడీయేననే ప్రచారాన్ని విస్తృతం చేసింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు ఆమోదమయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనుంది.
 
 ఏర్పాట్లు పూర్తి
 పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోరుజాతర సభను విజయవంతం చేసేందు కు జిల్లా శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సర్కస్‌గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ జంగారెడ్డితోపాటు పలువురు హాజరు కానున్నారు. 20 వేల మంది జనసమీకరణకు ఏర్పాట్లుచేశారు.
 
 సభ విజయవంతానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావుతోపాటు ఇతర నాయకులు కృషి చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎడవెల్లి జగ్గారెడ్డి కుమారుడు డాక్టర్ విజయేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కమలదళంలో చేరేందుకు నిర్ణయించుకున్నా రు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్ వైద్యవిధాన పరిషత్ గవర్నింగ్ బాడీ సభ్యులుగా పనిచేశారు. ఆయనతోపాటు టీడీపీ, టీఆర్‌ఎస్ నుంచి పలువురు నాయకు లు బీజేపీలో చేరనున్నారు. సభ ఏర్పాట్లను గుజ్జుల, అర్జున్‌రావు, విజయేందర్‌రెడ్డి పరిశీ లించారు. ఫ్లెక్సీలతో నగరం కాషాయమయం గా మారింది.
 
 అసమ్మతి సెగ
 బీజేపీలో రోజురోజుకూ వర్గపోరు ఎక్కువవుతుండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా నియోజకవర్గాలపై ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పునర్నిర్మాణం కోసం యత్నిస్తుంటే.. జిల్లాలో మా త్రం పరిస్థితి దిగజారుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సభకు జిల్లాకు చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావుతోపాటు పలువురు హాజరయ్యే అవకాశాలు లేవని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు సభ ఏర్పాట్లు, జనసమీకరణకు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సభ అనంతరం జిల్లా పార్టీ శ్రేణులకు వ ర్గాల పోరుపై కిషన్‌రెడ్డి హితబోధ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement