పగిడ్యాలలో భారీ దొంగతనం | the massive theft In pagidyala | Sakshi
Sakshi News home page

పగిడ్యాలలో భారీ దొంగతనం

Dec 28 2015 12:19 PM | Updated on Sep 4 2018 5:07 PM

కర్నూలు జిల్లా పగిడ్యాలలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.

కర్నూలు జిల్లా పగిడ్యాలలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు సహా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. వారు సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువాలో పరిశీలించగా రూ.50వేల నగదుతోపాటు పది తులాల ఆభరణాలు కనిపించలేదు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శివాంజల్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement