ఆర్థిక రాజధానిగా విశాఖ | Sakshi
Sakshi News home page

ఆర్థిక రాజధానిగా విశాఖ

Published Thu, Jun 12 2014 3:12 AM

ఆర్థిక రాజధానిగా విశాఖ - Sakshi

మంత్రి అయ్యన్నపాత్రుడు
 
సింహాచలం: విశాఖ ఆర్థిక రాజధాని గా అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయ ల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం నగరానికి వచ్చిన ఆయ న తొలుత సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్ట మంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. సింహాచ ల దేవస్థానం భూసమస్యతో పాటు రైల్వేజోన్, విమ్స్, ఫ్లైఓవర్ నిర్మాణం, కేజీహెచ్ అభివృద్ధి తదితర వాటి పై గురువారం జరిగే కేబినెట్ తొలి భేటీలో చర్చిస్తామన్నారు.   

ఏ రాష్ట్రంలో లేని రాజధాని నిర్మాణం

సిరిపురం: దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధానిని మన రాష్ట్రంలో నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. టీడీపీ నగర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుతో కలిసి మంత్రి అయ్య న్న విలేకరులతో మాట్లాడారు. విమ్స్ ఆస్పత్రికి రూ.60 కోట్లు కేటారుుంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పిస్తా మన్నారు. దాడి వీరభద్రరావు టీడీపీలో చేరతారా అని విలేకరులు అడగ్గా తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు.    
 
 

Advertisement
Advertisement