మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ | The families of the victims of YS Jagan paramarsa | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

Jan 7 2015 10:11 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతపురం: మావటూరులో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను  పరామర్శించారు. మృతులు నర్సింహులు , గంగాధర్, అనిల్‌కుమార్, నరేంద్ర, అశోక్, భాస్కర్ , హన్మతరాయుడు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. 

ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలలో  ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement