ఏపీలో వైద్య సేవలు పొందే గడువు పొడిగింపు | The extension of the deadline to receive medical services in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో వైద్య సేవలు పొందే గడువు పొడిగింపు

May 6 2015 12:24 AM | Updated on Oct 9 2018 7:52 PM

తెలంగాణలోని ఉద్యోగులు, పింఛన్‌దారులు ఏపీలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు.

తెలంగాణ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులు, పింఛన్‌దారులు ఏపీలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. నగదు రహిత చికిత్స విధానంలో కానీ వైద్య బిల్లులు తిరిగి చెల్లించే పద్ధతిలో కానీ ఏపీలో వైద్య సేవలను పొందడానికి వెసులుబాటు కల్పిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు పొడిగింపుగా మంగళవారం తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.


దీనికి సంబంధించి గత మార్చి 31 వరకు వర్తించేలా అదే నెల 26న జీవో విడుదల చేయగా, ఇప్పుడు జూన్ 30 వరకు వెసులుబాటు కల్పించింది. ఈ ఆసుపత్రుల్లో నగదు రహిత, నగదు చెల్లిం చి చికిత్స చేయించుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత వైద్య బిల్లులు పొందొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement