కూచిపూడికి రాష్ట్ర కళ హోదా | the art of kuchipudi gets special status of state | Sakshi
Sakshi News home page

కూచిపూడికి రాష్ట్ర కళ హోదా

May 3 2015 11:40 PM | Updated on Sep 3 2017 1:21 AM

కూచిపూడి నాట్యాన్ని రాష్ట్ర కళగా ప్రభుత్వం గుర్తించిందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు.

రాజమండ్రి కల్చరల్ (తూర్పుగోదావరి): కూచిపూడి నాట్యాన్ని రాష్ట్ర కళగా ప్రభుత్వం గుర్తించిందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆదివారం రాజమండ్రి రామకృష్ణ మఠం ఆడిటోరియంలో జరిగిన జాతీయ కూచిపూడి నాట్య పోటీలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కృష్ణా జిల్లా, కూచిపూడి గ్రామంలో కూచిపూడి భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. కాగా, కూచిపూడి పోటీలలో పాల్గొన్న విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement