కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు! | Terrorist Activities in krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు!

Jun 6 2015 12:17 PM | Updated on Sep 3 2017 3:19 AM

కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం.

విజయవాడ : కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి కంచికచర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్పై అనుమానం వచ్చి స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపారు. దాంతో డ్రైవర్ కారును వదిలేసి పరారైయ్యాడు. పారిపోయే సమయంలో సదరు డ్రైవర్ చేతిలో తుపాకీ ఉందని స్థానికులు వెల్లడించారు.

పోలీసులు కారును స్వాధీనం చేసుకుని... పోలీసు స్టేషన్కు తరలించారు. కారు యజమాని ఎవరు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement