
ప్రశ్నపత్రాలను ప్రత్యేక వాహనాల్లోకి చేరుస్తున్న దృశ్యం
నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. గురువారం వచ్చిన సెట్–1 ప్రశ్నపత్రాలను స్థానిక పొదలకూరురోడ్డులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో స్ట్రాంగ్‌రూంలో పోలీసు పహారా మధ్య భద్రపరిచారు. శుక్రవారం డీఆర్వో వి.వెంకటసుబ్బయ్య, డీఈఓ కె.శామ్యూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా జిల్లాలోని 56 పోలీసుస్టేషన్లకు తరలించారు. శనివారం రానున్న మిగిలిన సెట్–1 పేపర్లను అదేరోజు పోలీసుస్టేషన్లకు తరలించనున్నారు. రెండో సెట్ ప్రశ్నపత్రాలు ఈ నెల 17,18 తేదీలలో రానున్నాయి.
పరిశీలకులుగా గీత
పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులుగా డిప్యూటీ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్.గీతను నియమించారు. ఈమె ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల తీరు తెన్నులను పరిశీలించనున్నారు.