రేపు టెన్త్‌ ఫలితాలు

Tenth class results 2019 is tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల కానున్నాయి. విజయవాడలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు 2,839 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి.

మొత్తం పరీక్ష రాసిన వారిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం ముందుగానే పూర్తి కావాల్సి ఉన్నా ఎన్నికల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. అయినా మూల్యాంకనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫలితాల విడుదలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top