అమ్మవారి ఆలయంలో భారీ చోరీ | Temple Robbed in Guntur district | Sakshi
Sakshi News home page

అమ్మవారి ఆలయంలో భారీ చోరీ

Jul 12 2014 9:09 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెంలోని గత అర్థరాత్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది.

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెంలోని గత అర్థరాత్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోకి చోరబడిన దుండగులు అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని ఈ రోజు తెల్లవారుజామున ఆలయ పూజారీ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు.

 

గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయానికి చేరుకుని చోరీ జరిగిన తీరును గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మవారి ఆభరణాలకు సంబంధించిన వివరాలను పోలీసులు పూజారీ నుంచి సేకరిస్తున్నారు. లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు చోరీ అయ్యాయని  పూజరీ పోలీసులకు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement