ఐటీగ్రిడ్స్‌ కేసు: నలుగురికి హైకోర్టు నోటీసులు | Telangana High Court Issue Notices On IT Grids Case | Sakshi
Sakshi News home page

ఐటీగ్రిడ్స్‌ కేసు: నలుగురికి హైకోర్టు నోటీసులు

Mar 27 2019 7:22 PM | Updated on Mar 27 2019 7:36 PM

Telangana High Court Issue Notices On IT Grids Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీగ్రిడ్స్‌ కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా ఇంప్లీడ్‌ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్‌ చేయవద్దని పిటిషనర్‌ లోకేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే ఇంప్లీడ్‌ పిటిషన్‌లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రధాన అధికారికి, ఆధార్‌ అథారిటీ అధికారులుకి, ఏపీ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు, డేటా ఎన్‌రోలింగ్‌ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ, లోకేశ్వర్‌ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్‌ 22 కు వాయిదా వేసింది. 

(చదవండి: ఐటీగ్రిడ్స్‌పై వాడీవేడి వాదనలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement