
సాక్షి, తిరుమల : తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ వీఐపీ సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తొలుత వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్.. ఆ తర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయం వెలుపలకు చేరుకున్న గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తాను శ్రీవారి భక్తురాలినని.. స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వాహణ బాగుందని కితాబిచ్చారు.