ఐదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌ను సస్పెండ్ చేశారు.
ఐదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌ను సస్పెండ్ చేశారు.శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సర్సివాడ ప్రాధమికొన్నత పాఠశాలలో పనిచేస్తున్న సి. ఉమాపతి అనే ఉపాధ్యాయుడు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు విచారణ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి సదరు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.