'ఆ రెండు పార్టీల కంటే టీడీపీనే బలంగా ఉంది' | TDP strong in telangana region, says Errabelli Dayakar rao | Sakshi
Sakshi News home page

'ఆ రెండు పార్టీల కంటే టీడీపీనే బలంగా ఉంది'

Feb 22 2014 10:24 AM | Updated on Aug 10 2018 6:49 PM

'ఆ రెండు పార్టీల కంటే టీడీపీనే బలంగా ఉంది' - Sakshi

'ఆ రెండు పార్టీల కంటే టీడీపీనే బలంగా ఉంది'

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కంటే తమ పార్టీకే బలమైన క్యాడర్ ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కంటే తమ పార్టీకే బలమైన క్యాడర్ ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.... తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే అని నొక్కి వక్కాణించారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.

 

తమ పార్టీని మరింత పటిష్ట పరిచే క్రమంలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ రెండు సార్లు కేంద్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తు చేశారు. చంద్రబాబుపై పలు పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొడతామని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement