టిడిపి ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం | TDP MLA's son outrage | Sakshi
Sakshi News home page

టిడిపి ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం

Sep 21 2014 2:08 PM | Updated on Aug 10 2018 7:19 PM

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుమారులు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుమారులు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. అధికారంలో ఉన్నాంగదా అని రెచ్చిపోతున్నారు. నిన్న అనంతపురంలో టిడిపి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్ సాక్షి ప్రతినిధులపై దాడి చేశాడు. ఈరోజు  విజయవాడ సెంట్రల్ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు కుమారుడు మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేశాడు.

స్థానికుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాలో  కొందరు యువకులు బైకు రేసులు యధేచ్ఛగా సాగిస్తున్నారు. ఈరోజు తాడేపల్లి వద్ద యువకులు బైకు రేసులు నిర్వహించారు. ఈ రేసుల్లో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడు కూడా పాల్గొన్నాడు. రేసులు అడ్డుకున్న స్థానికులపై యువకులు దౌర్జన్యం చేశారు. ఆ ఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై బొండా ఉమ కుమాడు దౌర్జన్యం చేశాడు. బైకు రేసులు, యువకుల ఆగడాల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement