మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత

TDP MLA Chintamaneni Prabhakar Fires On Media Over His Controversial Comments On Dalits - Sakshi

సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’  అంటూ దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) మరోసారి రెచ్చిపోయారు. దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి ఏలూరులోని సాక్షి కార్యాలయానికి చేరుకున్న ఆయన.. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో విలేకరులు లేరని చెప్పడంతో మళ్లీ వస్తానంటూ వెనుదిగారు.

దళిత సంఘాలు వర్సెస్‌ టీడీపీ కార్యకర్తలు..
ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ : తమను అవమానపరిచిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌లో దళితులు ధర్నా  చేసేందుకు ఉపక్రమించారు. దీంతో అప్రమత్తమైన చింతమనేని అనుచరులు వీరిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలను భారీగా మోహరించారు. దీంతో ఫైర్‌ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top