కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే | TDP MLA attended to the court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే

Jul 1 2014 2:56 AM | Updated on Mar 25 2019 3:06 PM

కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే - Sakshi

కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి సోమవారం ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు.

 ఎమ్మిగనూరు టౌన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి సోమవారం ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. గత మార్చి 30న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ఆదిఆంధ్ర పాఠశాలలోని పోలింగ్ బూత్‌కు సమీపంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లతో చర్చిస్తుండటంతో పట్టణ పోలీసులు ఆయనపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. సోమవారం ఈ కేసు వాయిదా ఉండటంతో ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement