
శ్రీకాకుళం: మేము చేపల వేట చేసుకుని బతుకుతున్నాం. మేము నివసిస్తున్న వీధిలో టీడీపీ వారు ఇబ్బం ది పెడుతున్నారు. పంచాయతీ స్థలం ఉన్నా మా ఇంటికి ఎదురుగా ట్యాంకు నిర్మించి దారిలేకుండా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందనీయడం లేదు.– కండ్ర వీధి కండ్ర కులస్తులు,కవిటి
ఆపరేషన్ అవసరం
శ్రీకాకుళం: నా బిడ్డ రుషికేశవ బెహరాకు గుండె ఆపరేషన్ చేయించి ఆదుకోవాలి. తొలుత కిడ్నీ సంబంధి త వ్యాధి వచ్చింది. గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధి కూడా వచ్చిందని వైద్యులు చెబు తున్నారు. నా బిడ్డకు ఆపరేషన్ చేయించి ఆదుకోవాలి– రుషికేశవ్ బెహరాతో తండ్రి నర్సుతం బెహరా, కవిటి.
గొడౌన్ తరలింపు తగదు
కవిటి సివిల్ సప్లయ్ గొడౌన్ తరలింపు నిలిపివేయించాలి. టీడీపీ ప్రభుత్వం సివిల్‌సప్లయ్ గొడౌన్‌ను తరలిస్తోంది. ఇది తరలిస్తే ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న హమాలీలు ఉపాధి కోల్పోతారు.
– బొర్ర బాలకష్ణ, హమాలీ, కవిటి