విశాఖపట్నం జిల్లా భీమిలిలో శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశం రసాభాసగా మారింది.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా భీమిలిలో శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశం రసాభాసగా మారింది. భీమిలి టీడీపీ అధ్యక్ష పదవి కోసం తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.
టీడీపీ నేతలు మద్దుల వెంకట గురుమూర్తి, కొప్పల రమేష్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భీమిలి టీడీపీ అధ్యక్ష పదవిని పాలకుర్త రాంబాబుకు ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేయగా, తనకే ఇవ్వాలని వెంకట గురుమూర్తి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో సమావేశం వాయిదా పడింది.