టీడీపీ నేత పోతుల సురేష్ అరెస్ట్ | tdp leader potula suresh arrest | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత పోతుల సురేష్ అరెస్ట్

Aug 1 2014 1:31 AM | Updated on Aug 10 2018 8:08 PM

టీడీపీ నేత, ఆర్‌ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్‌ను అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు.

ధర్మవరం:  టీడీపీ నేత, ఆర్‌ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్‌ను అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. పట్టణంలోని శివనగర్ సమీపంలోనున్న బిన్ని మిల్స్‌లో పోతుల సురేష్ అనుచరులతో కలిసి ఉండగా అటువైపు వెళ్లిన ఎస్‌ఐ శ్రీరామ్.. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement